Monday, November 10, 2025

సర్వే నం,120లో భూ..బకాసురులు

కోట్లాది రూపాయల భూమి ఆక్రమణ

నకిలీ పత్రాలతో 60 గజాల చొప్పున విక్రయం

ఒక్కో ప్లాట్లుకు రూ.15లక్షలు వసూలు చేస్తున్న రియల్లర్లు

పాలకుల కనుసన్నల్లో కట్టడాలు

ఆక్రమిత స్థలాల్లో వెలిసిన నిర్మాణాలు

నోరు మెదపని రెవెన్యూ, హైడ్రా అధికారులు

కుత్బుల్లాపూర్ అక్టోబర్30,ప్రభ: ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. కబ్జాకోరులు ప్రభుత్వ భూములు ఎక్కడుంటే అక్కడ గద్దల్లా వాలుతున్నారు. ఖాళీ స్థలాలకు హద్దురాళ్లు పాతించడం, ఫెన్సింగ్‌ వేయడం చేస్తున్నారు. కబ్జాలకు పాల్పడుతూ.. రాజకీయ అండదండలతో సర్కారు భూములను చెరబడుతున్నారు. నాలాలు , చెరువులు, గుట్టలు.. ఇలా ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా కబ్జాలు చేస్తూ వెంటనే నిర్మాణాలు చేపడుతున్నారు. భూములు, ప్లాట్ల రేట్లు విపరీతంగా పెరగడంతో భూ కబ్జానే సంపాదనగా ఎంచుకుంటున్నారు. కబ్జాదారులకు స్థానిక రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కళ్ల ముందే ఇంత జరుగుతున్నా అధికారులకు పట్టించుకోవడం లేదు. దుండిగల్ మండల పరిధిలోని సర్వేనెం,120 లో కబ్జాలే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ భూమి కబ్జా చేసి ఇళ్లు నిర్మించుకున్నారు. *కొనసాగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణ*గతంలో చేసిన భూ ఆక్రమణలపై అధికారులు విచారణ పేరుతో జాప్యం చేస్తున్నారు. దీంతో సదరు భూకబ్జాదారులు గుర్తుతెలియని పేర్లతో భూములను ఆక్రమించి రెవెన్యూ రికార్డులను సైతం అప్పటి అధికారుల సహాయంతో మార్చేశారు. వాటిపై ఆర్డీవో నిర్వహించిన ప్రత్యేక స్పందనలో ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదు. దీంతో భూఅక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. 120 సర్వే నెంబర్‌లోని ప్రభుత్వ భూమి పరులపాలవుతోంది. తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాల్లో పని చేసే కింది స్థాయి సిబ్బందితో పాటు డివిజన్‌ స్థాయి అధికారుల తోడ్పాటుతోనే స్థిరాస్తి వ్యాపారులు ప్రభుత్వ భూములను కజ్జా చేస్తున్నారని ఆరోపణలున్నాయి.”ప్రభుత్వ భూములు ఇలా కబ్జా కావడానికి ఎవరెవరి హస్తం ఉందో వారిపై చర్యలు తీసుకోవాలి. అధికారులు, ప్రజాప్రతినిధుల అండతోనే రియల్​ఎస్టేట్​ వ్యాపారులు ప్రభుత్వ భూములను కబ్జా చేశారు అని ఆరోపణాలు ఉన్నాయి. అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని పేదలకు అందేలా చూడాలని స్థానిక ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ. కోట్ల విలువ చేసే భూములను కనీసం సర్వే చేయడానికి అధికారులు ఆసక్తి చూపకపోవడం వల్ల.. స్థిరాస్తి వ్యాపారులతో లోపాయికారి ఒప్పందం ఉందనే విమర్శలకు బలం చేకూరుస్తోంది.నాయకులు, రెవెన్యూ అధికారుల, అండదండలతోనే*దుండిగల్ మండల్ సర్వే నం,120 భూఆక్రమణ వ్యవహారంలో కొందరు ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, రియల్టర్ల అండదండలతోనే జరుగుతుందనే ఆరోపణ లు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ స్థలాన్ని చదును చేస్తున్నా రెవెన్యూ అధికారుల దృష్టికి రాకపోవడం గమనార్హం. ఇటీవల అధికారులు ప్రభుత్వ స్థలం పేరిట బోర్డు ఏర్పాటు చేయగా.. అక్కడే ప్లాటు కోసం మార్కింగ్‌ చేయడం వారి అక్రమాలకు అదొక నిదర్శనం. ప్రస్తుత కాలనీలోనే కొందరు నివాసాల అమ్మకాల కోసం తమ అనుచరులతో కార్యాలయాలు కూడా ఏర్పాటు చేశారని తెలుస్తుంది. కోట్ల స్థలానికి ఎసరు పెట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మండల, సరిహద్దులోని ఈ విలువైన స్థలాల రక్షణకు అధికారులు స్థలం చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి రక్షించాలని దుండిగల్ వాసులు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular