తిరుమల శ్రీవారి భక్తులకు భారీ శుభవార్త. హైదరాబాద్ నుంచి మరో విమాన సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. తిరుపతికి విమాన సర్వీసులను ఇండిగో పునరుద్దరించింది. తిరుమలకు తరచూ వేలాదిమంది హైదరాబాద్ నుంచి వెళ్తుంటారు. అలాంటి వారికి మళ్లీ ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చినట్లయింది.
Tirumala Darshan: హైదరాబాద్ నుంచి తరచూ వేలమంది తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతుంటారు. రైళ్లు, బస్సుల ద్వారా ఎక్కువమంది తిరుపతికి వెళుతుంటారు. ఇక వేగంగా వెళ్లి దర్శనం చేసుకుని రావాలనుకునేవారు శంషాబాద్ నుంచి తిరుపతికి విమానంలో వెళుతుంటారు. రైల్లో వెళ్లాలనుకుంటే సికింద్రాబాద్, కాచిగూడ నుంచి అనేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇక తిరుపతికి వందే భారత్ రైలు కూడా సర్వీస్ అందిస్తోంది. ఇక బస్సుల్లో వెళ్లాలనుకుంటే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజ్ కింద ప్రత్యేక రైళ్లను కూడా తిరుమతికి నడుపుతోంది.

