కూకట్ పల్లి అక్టోబర్ 30,ప్రభ: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జేఎన్టీయూహెచ్ శాఖ ఆధ్వర్యంలో 8300 కోట్ల స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రధాన గేట్ ముందు ధర్నా నిర్వహించి మెయిన్ రోడ్ ను దిబ్బందించడం జరిగింది . ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉందని దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. 8300 కోట్ల స్కాలర్షిప్ బకాయిలను ఆపడం ద్వారా ఎంతో మంది విద్యార్థులు తమ భవిష్యత్తును కోల్పోతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి స్కాలర్షిప్లను రిలీజ్ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. లేకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వాన్ని గద్దతించేంతవరకు విద్యార్థులు నిద్రపోరని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యసమితి సభ్యులు పూజిత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రిషి, యూనివర్సిటీ అధ్యక్ష కార్యదర్శిలు శ్రీరామ్ శివమణి, దుర్గాప్రసాద్ యశ్వంత్,జశ్వంత్,లేఖాజ్,అజయ్ విశ్వవిద్యాలయ నాయకులు,విద్యార్థులు పాల్గొన్నారు.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జేఎన్టీయూహెచ్ శాఖ ఆధ్వర్యంలో ధర్నా
RELATED ARTICLES

