కర్నూల్ అక్టోబర్ 30,ప్రభ: నవంబర్ 6వ తేదీన కర్నూల్ నగరంలో జరుగు నీలం రామచంద్రయ్య, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ 50 ఏళ్ల అమరత్వ స్మారక సభను జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నంద్యాల జిల్లా కార్యదర్శి నరసింహులు, నగర కార్యదర్శి వెంకటస్వామి పిలుపునిచ్చారు. కర్నూల్ నగరంలో కలెక్టర్ కార్యాలయం నందు మీడియా రూమ్ దగ్గర అమరవీరుల స్మారక సభ గోడపత్రికలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వై. నరసింహులు,వెంకటస్వామి, పీ డీ ఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కె. భాస్కర్ మాట్లాడుతూ 1975 నవంబర్ 5వ తేదీన ఎమర్జెన్సీ కాలంలో మాజీ ఎమ్మెల్సీ నీలం రామచంద్రయ్య, పీ డీ ఎస్ యూ నిర్మాత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ను విజయవాడ రైల్వే స్టేషన్లో పట్టుకొని ఖమ్మం జిల్లా చీకటి గండ్ల అడవులలో కాల్చి చంపారు. వారి అమృత్వానికి నేటికీ 50 ఏళ్ల అవుతున్న సందర్భంగా కర్నూల్ నగరంలో ప్రభుత్వ డైవర్ అసోసియేషన్ హాల్ నందు స్మారక సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. కామ్రేడ్ నీలం రామచంద్రయ్య స్వగ్రామం బొల్లవరం గ్రామం, కర్నూలు జిల్లా వాసి టీచర్ ఎమ్మెల్సీగా ఉన్నాడని అన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో తీవ్ర మితవాద శక్తులు ఫాసిస్ట్ శక్తులు బలపడుతున్న నేపథ్యంలో వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమాలు బలపడవలసిన అవసరం ఉందని అన్నారు. దేశంలో మోడీ ఫాసిస్ట్ పాలన అడుగుజాడల్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పాలన ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటానికి సిద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ స్మారక సభకు ప్రజలు ప్రజాసామికవాదులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత రైతుకులీ సంఘం నాయకులు నీలం జగన్, రాజు, ఐ ఎఫ్ టి యూ జిల్లా నాయకులు తిరుపాల్, నారాయణ, తిమ్మప్ప, పీ డీ ఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ, ఆది మొదలైన వారు పాల్గొన్నారు.
స్మారక సభను జయప్రదం చేయండి: సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ
RELATED ARTICLES

