Monday, November 10, 2025

కార్మికులకు రావలసిన వేతనం ఇప్పించిన: బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి

కుత్బుల్లాపూర్ అక్టోబర్ 30,ప్రభ: దుల్లపల్లి ఇండస్ట్రీ ఏరియాలో “ప్యూర్ ఓ నేచురల్ వేర్హౌస్ ఎగ్జిక్యూటివ్” కంపెనీ లో గణేష్ అనే కార్మికుడు గత కొన్ని సంవత్సరాల నుంచి కంపెనీ లో పనిచేసేవారు, కొన్ని అనివార్య కారణాలవల్ల కంపెనీ లో పనిచేస్తున్న గణేష్ మానేయడం జరిగింది… గణేష్ అనే కార్మికుడు కి ఒక నెల వేతనం, 35000/- వేల రూపాయలు రావాల్సి ఉండగా అవి ఇవ్వకపోవడంతో పలుమార్లు కంపెనీ యాజమాన్యం నీ ఎన్నిసార్లు అడిగినా గణేష్ పట్ల నిర్లక్ష్యం వహిస్తూ తనను ఏదో రకంగా కంపెనీ యజమాన్యం పట్టించుకోవడం లేదు, అని తెలుసుకొని అడిగి అడిగి విసుగు చెందిన కార్మికుడు గణేష్ కి ఏం చేయాలో అర్ధం కాక ఎవరైతే కార్మికులకు న్యాయం చేస్తారని తోటి కార్మిక మిత్రుల ద్వారా తెలుసుకొని, బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి గురించి తెలుసుకొని తన కార్యాలయం వద్దకు వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి వివరించారు.. వెంటనే స్పందించిన కార్మిక నాయకుడు రవి హుటాహుటిన “ప్యూర్ ఓ నేచురల్ వేర్హౌస్ ఎగ్జిక్యూటివ్” కంపెనీ వద్దకు బయలుదేరి యజమాన్యంతో పలుమార్లు చర్చించి కార్మికుడికి రావలసిన ఒక నెల వేత్తనం మొత్తం 35000/- వేల రూపాయలు ఇప్పించడం జరిగింది… కార్మికుడు గణేష్ మాట్లాడుతూ నాకు మా కుటుంబానికి న్యాయం చేసిన కార్మికనాయకుడు రవి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో అనిల్, సుదర్శన్, జగన్, కిరణ్, పాల్గొన్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular