Monday, November 10, 2025

ఫ్యూచర్ స్కీం భూములు అన్యాక్రాంతం

• ఆల్విన్ కాలనీ భూములకు ఎసరు పెడుతున్న సొసైటీ

• అక్రమాలను ప్రశ్నిస్తే బెదిరింపులు తథ్యం

• కోట్లాది విలువైన భూమి కాజేతకు సొసైటీ నాయకుల కుట్ర

• నోటీసులు జారీ చేసి సెటిల్మెంట్లకు తెర లేపిన అధికారులు

• ఫ్యూచర్ స్కీం భూములను కాపాడాలి అంటున్న ఆల్విన్ కాలనీ వాసులు

కూకట్ పల్లి నవంబర్ 1,ప్రభ: కాలి స్థలాలు కనిపిస్తే చాలు అక్రమార్కుల గద్దల్లా వాలిపోతున్నారు. కోట్ల రూపాయల విలువైన భూమి అన్యాక్రాంతమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కూకట్ పల్లి 24 సర్కిల్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్:1 లో భవిష్యత్తు కోసం కేటాయించిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. కాపాడవలసిన సంక్షేమ సంఘం నాయకులే కబ్జాలకు తెర లేపారు. విషయాన్ని జిహెచ్ఎంసి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.కూకట్ పల్లి 24 సర్కిల్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్:1 లో ఫ్యూచర్ స్కీం కోసం కేటాయించిన భూములు కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రాజకీయ పలుకుబడి, అధికారుల అండతోనే కొందరు కబ్జా చేస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న స్థానిక సంక్షేమ సంఘం నాయకులు సబ్జాదారులతో చేతులు కలిపి సహకరిస్తున్నారని స్థానికుల ఆరోపిస్తున్నారు. కబ్జాకు గురైన భూములకు రూ.3 కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు ధర పలుకుతుంది. దీంతో ఇక్కడ అక్రమార్కులు గప్‌చుప్‌గా ఫ్యూచర్ స్కీమ్ భూములను కొట్టేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆల్విన్ కాలనీ లో 15 సంవత్సరాల క్రితం పబ్లిక్ పార్క్, అంగన్వాడి కేంద్రాలు, స్కూళ్లు, కమ్యూనిటీ హాల్, షాపింగ్ మాల్స్ ఇతర భవిష్యత్తు తరాల కోసం దాదాపు 70 ప్లాట్ల వరకు కేటాయించడం జరిగింది. ఇందులో 50 ప్లాట్లో వరకు ఫ్యూచర్ స్కీం భూములు కబ్జాలకు గురయ్యాయి. మిగతా భూములు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడడానికి తప్ప భూములు ఆక్రమించి అమ్మడానికి ఎవరికీ హక్కు లేదు. మిగతా భూమిలో కొందరు సొసైటీని అడ్డుపెట్టుకొని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే, దీనిని స్థానికులు అడ్డుకున్న కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే భూమిని స్థానిక మాజీ సంక్షేమ సంఘం నాయకులు కొందరు కబ్జా చేసి అమ్మి సొమ్ము చేసుకున్నారని ఆరోపణాలు ఉన్నాయి. ప్రస్తుతం మిగిలిన కొంత భూమిని కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. దీనిపై తాము అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాచేసిన భూమిలో కొంతమంది అక్రమ నిర్మాణాలు చేపట్టారు. గుట్టు చప్పుడుగా అక్రమ నిర్మాణాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ఆ స్థలంలోకి ఎవరైనా వెళ్తే సీసీ కెమెరాలో సైరన్ మూగేలా ఏర్పాటు కూడా చేశారు. రిజిస్ట్రేషన్ లేని ఫ్యూచర్ స్కీం భూమిలోనే కోట్ల రూపాయలు క్రయ విక్రయాలు నిర్వహిస్తున్నారు. ఫ్యూచర్ స్కీం భూమిలోకి ఎవరూ రాకుండా సూచిక బోర్డులు ఏర్పాటుచేసిన కొందరు అక్రమార్కులు తొలగించి మరీ అక్రమాలకు పాల్పడుతున్నారు. జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదులు చేసిన చర్యలు తీసుకోవడం లేదని నోటీసులు మాత్రమే జారీ చేసి సెటిల్మెంట్లకు తెర లేపుతున్నారని ఆరోపణాలు గట్టిగానే ఉన్నాయి. ఇక్కడ మొత్తం 100 గజాల చొప్పున నాలుగు ప్లాట్లు స్థలాన్ని కబ్జా చేసేందుకు కబ్జాదారులు ప్రయత్నిస్తున్నారు. ఈ భూమి విలువ దాదాపు 4,కోట్లకు పైగా ఉండే అంచనాలు ఉన్నాయి. భవిష్యత్ కోసం ఏర్పాటుచేసిన స్థలాలను ఆక్రమించడం.. ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఆల్విన్ కాలనీ ఫేస్ 1 సమీపంలోని భవిష్యత్ కోసం కేటాయించిన భూమిని గుర్తించడం, ఇళ్ల స్థలాలుగా విక్రయించడం బహిరంగ వ్యాపారంగా మారింది. భూమిని చదునువేసి అక్రమార్కులకు సంబంధించినదిగా నమ్మకం కల్పిస్తున్నారు. ఆ తర్వాత ఇళ్ల స్థలాలుగా విక్రయిస్తున్నారు. స్వాధీన అగ్రిమెంటు చేయించి సొమ్ము చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల పట్టాభూమికి చెందిన సర్వేనంబర్లను వేసి కోర్టు ఆర్డర్లతో భవిష్యత్తు కోసం కేటాయించిన భూమిని వ్యాపారం చేస్తున్నారు. అంత విలువ కలిగిన భూమి అన్యాక్రాంతమవుతున్నా జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక వాసులు మండిపడుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular