కూకట్ పల్లి నవంబర్ 2,ప్రభ: దేశ ఐక్యతకు ప్రతిఒక్కరూ తన వంతు కృషిచేయాలని బాలానగర్ ఎస్ఐ సరిత రెడ్డి అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం స్వామీ వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ నేషన్’ స్ఫూర్తితో 3కే రన్ ను జండా ఊపి ప్రారంభించారు. బాలానగర్ డివిజన్ పరధిలోని ఐడిపిఎల్ డిమార్ట్ వద్ద ప్రారంభమైన ర్యాలీ గూడెన్మెట్ క్రాస్ రోడ్స్ మీదుగా కుత్బుల్లాపూర్ క్రాస్ రోడ్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా ఎస్ఐ సరిత రెడ్డి మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రతకు సర్దార్వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని,ఆయన ఆలోచనలు, విలువలు నేటి తరానికిస్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో జీడిమెట్ల సీఐగడ్డం మల్లేష్, స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లక్ష్మీనాథ్, కిషర్ బాబు, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


