*దుందిగల్ లో కల్తీ కళ్ళు అమ్మకాలు
• కల్లు కాదిది కాటికి పంపే రసాయనం..!
• ఒక్కసారి రుచి చూశారో అంతే సంగతులు..!
• కష్టజీవుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కళ్ళు దుకాణాలు..!
• ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం…!
• చర్యలలో విఫలం అవుతున్న ఎక్జైజ్ శాఖ..!
కుత్బుల్లాపూర్ నవంబర్ 4,ప్రభ: కల్తీ కల్లు విక్రయిస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొంతమంది వ్యాపారులు. కార్మికులు, కూలీల కడుపులు కొడుతూ అడ్డంగా సంపాదిస్తున్నారు. వింత మత్తును అలవాటు చేసి వారి కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. ఒల్లు గుళ్ల చేసి ఆస్పత్రుల చుట్టూ తిప్పిస్తున్నారు. కల్లు విక్రయాలపై ఎప్పటికప్పుడు నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. మామూళ్లతో పాటు రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో యథేచ్ఛగా కల్తీ కల్లు విక్రయాలు కొనసాగుతున్నాయి. తాజాగా కూకట్‌పల్లి లో కల్తీ కళ్ళు తాగి 9 మంది మృతి చెందిన సంఘటనలు మరువక ముందే దుందిగల్లు కల్తీ కళ్ళు జోరుగా సాగుతున్నాయి. కళ్ళు దుకాణదారులు రాజకీయ నాయకుల అండదండలతో కేసుల నుంచి తప్పించుకొని దర్జాగా తిరుగుతున్నారు. ఇంత జరుగుతున్నా ఏ నాయకుడు పట్టించుకోడు. ఏ ఎక్జైజ్ శాఖ అధికారి తనిఖీలు నిర్వహించారు. అది కల్తీ కల్లు అని తెలుసు. ప్రాణాలు హరిస్తుందని తెలుసు.. అయినా అధికారపార్టీ అండతో.. అధికారుల నీడలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. వ్యసనానికి అలవాటు పడిన ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. కాలకూట విషాన్ని పేదల శరీరాల్లోకి నింపి డబ్బులు దండుకుంటున్నారు. చాలామంది మత్తు పదార్థాలు కలిపిన కల్లు తాగుతూ అనారోగ్యం బారిన పడుతున్నారు. మరికొందరు మానసికస్థితి కోల్పోతున్నారు. మరణాలు సంభవిస్తున్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పరిధిలో కల్తీ కల్లు మాఫియా రెచ్చిపోతున్నా ఎక్జైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. నియంత్రించాల్సిన అధికారుల్లో కొందరు మామూళ్ల మత్తులో ముగిని తేలుతున్నారు.*నమూనాల సేకరణ ఏదీ..?*నిబంధనల ప్రకారం ఎక్సైజ్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కల్లు దుకాణాలు తనిఖీ చేయాలి. నమూనాలను ప్రాథమికంగా పరీక్షించడానికి అధికారుల వద్ద మినీ కిట్లు ఉంటాయి. ఎక్కడా నమూనాల ఫలితాలను బయటకు వెల్లడించడం లేదు. పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు మాత్రం హడావుడి చేసి పరీక్షలు చేస్తున్నారు. కల్తీ తేలిన దుకాణాలకు కొంత జరిమానా విధించి చేతులు దులుపుకొంటున్నారు.*తీవ్ర దుష్ప్రభావం*వ్యాపారులు మత్తు కోసం ఇందులో రకరకాల రసాయనాలు కలుపుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.10 లీటర్ల స్వచ్ఛమైన కల్లుకు 150 లీటర్ల నీళ్లు, మత్తు కోసం ఆల్ఫ్రోజోలం, డైజోఫాం, క్లోరో హైడ్రెడ్ తదితర నిషేధిత మత్తు రసాయనాలు కలుపుతున్నారు. అంతేకాకుండా అమ్మోనియం మిశ్రమ రసాయనాలు, సోడా యాష్, కుంకుడుకాయ రసం వాడుతున్నారు. దీనివల్ల నాడీ వ్య వస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కళ్లు పోవడం, మెదడు సరిగ్గా పనిచేయకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మూత్రపిండాల వ్యాధులు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు ప్రాణాలు సైతం పోతున్న ఘటనలు సంభవిస్తున్నాయి.*అనుమతికి మించి*కుత్బుల్లాపూర్ నియోజక పరిధిలోని దుండిగల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్ నగర్, బాచుపల్లి, నిజాంపేట్, గాజులరామారం, చింతల్,జగద్గిరిగుట్ట, పలు ప్రాంతాల్లో అనుమతిలేని కల్లు దుకాణాలు వందల్లో వెలిశాయి. ఎక్సైజ్ రికార్డులో మూసివేసినట్లుగా ఉన్న దుకాణాల్లోనూ జోరుగా విక్రయాలు సాగుతున్నాయి. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఏయే దుకాణం పరిధిలో ఎన్ని ఈత చెట్లు ఉన్నాయి..? వాటి నుంచి రోజుకు ఎంత కల్లు ఉత్పత్తి అవుతోంది..? అనే వివరాలు పక్కాగా ఉండాలి. ఈత చెట్లకు నంబర్లు కేటాయించాలి. ఎక్సైజ్ అధికారులు కొన్నేళ్ల కిందటి లెక్కల్ని నివేదికలో చూపుతున్నారు.డైజోఫాం, క్లోరో హైడ్రెట్ వంటి హానికర పదార్థాలను హైదరాబాద్ నుంచి తెప్పిస్తున్నట్లు తెలిసింది. గుట్టుచప్పుడు కాకుండా గుంతకల్లు, గుత్తి ప్రాంతాలకు తీసుకొచ్చి అక్కడ్నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. క్లోరోహైడ్రెట్ కిలో రూ.25 వేలు, డైజోఫాం కిలో రూ.80 వేలు చొప్పున విక్రయిస్తున్నారని, వీటి సరఫరాకు గుంతకల్లు కేంద్రంగా ప్రత్యేక ముఠా ఉన్నట్లు సమాచారం. ఇటీవల జిల్లాలో ఆలోజోలం అనే అత్యంత హానికరమైన మత్తు మందును వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.*కల్తీ ఇలా..*10 లీటర్ల స్వచ్ఛమైన కల్లుకు 150 లీటర్ల నీళ్లు కలుపుతారు. కుత్బుల్లాపూర్, దుండిగల్ , బొంతపల్లి, సుచిత్ర పలు ప్రాంతాలలో డిమాండుకు సరిపడా ఈత చెట్లు లేవు. 5 శాతం మేర మాత్రమే స్వచ్ఛమైన కల్లు విక్రయిస్తున్నారు. మిగిలిన 95 శాతం కల్తీనే. వ్యవసాయ తోటల్లో ఎక్కడికక్కడ రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకుని డైజోఫాం, క్లోరో హైడ్రెట్ వంటి నిషేధిత పదార్థాలను కలుపుతున్నట్లు సమాచారం. మొత్తం మిశ్రమాన్ని నీటి తొట్టెలో కలియ తిప్పుతారు. తీపి కోసం శాక్రిన్, నురగ కోసం అమ్మోనియం వంటి రసాయనాలను వాడుతున్నారు. ఉదయం పూట తయారు చేసిన మిశ్రమానికి ఈస్ట్ కలిపి సాయంత్రం వరకు పులియబెడతారు. తర్వాత సీసాల్లో నింపి దుకాణాలకు చేరవేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.





