హైదరాబాద్ నవంబర్ 9,ప్రభ : సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ ప్రీ ప్రైమరీ విద్యా విధానంలో నవశకానికి నాంది పలికారు. ప్రీ-ప్రైమరీ విద్యా విస్తరణకు శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాది 4,900 బడుల్లో యూకేజీ విద్యను అందించబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వ విద్యలో నవశకానికి నాంది పలుకబోతున్నారు. ప్రీ-ప్రైమరీ విద్యా విస్తరణకు పటిష్ఠ ప్రణాళిక తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది 4,900 బడుల్లో యూకేజీ విద్యను అందించబోతున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వ స్కూల్స్ ఒకటవ తరగతి నుంచి మాత్రమే విద్యను అందిస్తుండటం తెలిసిందే. మారుతున్న సామాజిక, సాంకేతిక పరిస్థితులు.. పేద, మధ్యతరగతి చిన్నారులకు ప్రాథమిక స్థాయి నుంచే నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కీలక ముందడుగు వేసింది. ఇది దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యకు ఒక రోల్ మోడల్ కానుంది. ఫలితంగా రాష్ట్రంలోని మొత్తం 5,900 ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు ప్రాథమిక విద్య అందనుంది. ఒక్కో పాఠశాలలో యూకేజీ తరగతి కోసం ఒక అనుభవజ్ఞుడైన టీచర్ తో పాటు ఒక ఆయాను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా దాదాపు 9,800 మందికి చిన్న స్థాయి ఉద్యోగాలు దక్కనున్నాయి. ఈ నియామకాలు ప్రధానంగా స్థానిక మహిళలకు ఉపాధిని కల్పిస్తాయి.
తెలంగాణ ప్రభుత్వ విద్యలో నవశకం.. బడుల్లో ఇకపై యూకేజీ విద్య కూడా..
RELATED ARTICLES

