తెలంగాణ, హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న టయోటా ఫార్చునర్ కారు ఘాట్ రోడ్డులో మంటల్లో దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో క్షణాల్లోనే కారు మంటల్లో చిక్కుకుంది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులు సమయానికి కారు దిగి బయటపడారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

