తెలంగాణ: నిజామాబాద్ జిల్లాలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, లంచాల కారణంగా అనర్హులకు సైతం తెల్ల రేషన్ కార్డులు కేటాయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అర్హులైన పేదల కంటే లక్షకు పైగా ఎక్కువ కుటుంబాలకు కార్డులు మంజూరు కావడం దీనికి నిదర్శనం. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను.. ఎన్నికల హామీలో భాగంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది. కొత్త కార్డుల మంజూరుకు దరఖాస్తులు స్వీకరించడంతో పాటు, పాత కార్డుల్లో అదనపు పేర్ల నమోదుకు కూడా అవకాశం కల్పించింది. అయితే కొన్ని చోట్ల అనర్హులు కూడా అక్రమంగా కార్డులు పొందారు. నిజామాబాద్ జిల్లా అర్బన్ ప్రాంతంలో కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, కొందరు ఉద్యోగుల వసూళ్ల కారణంగా దారిద్య్ర రేఖకు దిగువన (బీపీల్) ఉన్న అర్హులను పక్కనపెట్టి.. ఆర్థికంగా స్థితిమంతులైన అనర్హులకు సైతం కొత్త ‘ఆహార భద్రత’ కార్డులు కేటాయించినట్లు తెలుస్తోంది.
కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి అలర్ట్.. వారికి రేషన్ బంద్, కార్డులు కూడా రద్దు
RELATED ARTICLES

