Thursday, January 15, 2026

ఎస్.ఎస్.ఎల్ ఇన్ఫ్రా బాగోతం

• పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ వెంచర్లు

• మితిమీరి పోతున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ఆగడాలు..

• అనుమతులు లేకుండా ఎకరాల కొద్ది సాగు భూముల్లో వెంచర్లు

• జిల్లా కేంద్రంలో మితిమీరుతున్న రియల్టర్ల ఆగడాలు

• ప్రభుత్వ చట్టానికి తూట్లు…నియమ, నిబంధనలు బేఖాతర్‌

• లే అవుట్‌ అనుమతులు లేకుండానే ప్లాట్ల ఏర్పాటు

• తూతూ మంత్రంగా అధికారుల దాడులు

• ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి

మర్పల్లి నవంబర్ 11,ప్రభ: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఎకరాల కొద్ది భూముల్లో అక్రమంగా వెంచర్లు ఏర్పాటు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన మర్పల్లి పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లో అక్రమ దందా జోరుగా సాగుతోంది. తక్కువ ధరలకు పట్టా భూములు కొనుగోలు చేస్తున్న ఎస్.ఎస్.ఎల్ ఇన్ఫ్రా సమస్త పేరుతో కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వాటిలో నిబంధనలకు విరుద్దంగా ప్లాట్ల వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వెంచర్లపై కొనుగోలు చేసిన వాళ్లకి క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తామని ప్రతి గుంటకి నాలుగు వేల చొప్పున నెలసరి ఆదాయం మీకు చెందుతుందని ప్రజలను మోసం చేస్తూ నయా దందా కి తెరలేపారు. పంట పొలాలను ప్లాట్లుగా మార్చి హద్దురాలు పాత కుండా మొక్కలు నాటుతూ వాటి మెయింటెనెన్స్ మొత్తం మేమే చూసుకుంటామంటూ వచ్చిన ఆదాయంలో 50% శాతం మెయింటెనెన్స్ ఖర్చులు పోగా మిగతా డబ్బులు మీకు కోట్లలో వస్తాయని ప్రజలను బురిడీ కొట్టిస్తూ అక్రమంగా కోట్లు వసూళ్లకు పాల్పడుతున్నారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కొనుగోలుదారులు చాలావరకు మోసపోయారని ఇచ్చిన డబ్బులు కాక క్యాష్ బ్యాక్ పేరుతో వినియోగదారులను ఆశపెట్టి నెలసరిగా వచ్చే డబ్బులు కూడా బ్యాంకు ఖాతాలో వెయ్యట్లేదని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు లేఅవుట్లు చూపిస్తూ ఎవరి ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఇంత తతంగం జరుగుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వివరిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కారణంగా మున్సిపాలిటీల ఆదాయానికి గండిపడటంతోపాటు ఆయా వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసే ప్రజలు ఇంటి నిర్మాణాలకు అనుమతులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల మున్సిపల్‌ అధికారులు జిల్లా కేంద్రంలో జరిపిన దాడుల సందర్భంగా అక్రమ వెంచర్ల వ్యవహారం వెలుగు చూసింది. జిల్లా కేంద్రంలోని మర్పల్లి మండల పరిధిలోని తుమ్మలపల్లి, పొట్లూర్ గ్రామం సర్వే నంబర్,223/ఎ/2/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/2 లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఎస్.ఎస్.ఎల్ ఇన్ఫ్రా సమస్త పేరుతో అక్రమ వెంచర్లు ఏర్పాటు చేశారు.

నిబంధనలకు తూట్లు:పట్టా భూముల్లో వెంచర్లు ఏర్పాటు చేయాలంటే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పలు నిబంధనలు ఉన్నాయి. వెంచర్లు ఏర్పాటు చేసే స్థలాలు వ్యవసాయ భూములుగా, పారిశ్రామిక ప్రాంతాలుగా ఉండకూడదు. నివాసయోగ్యంగా ఉండాలి. వ్యవసాయ భూముల్లో వెంచర్లు ఏర్పాటు చేయాలంటే మొదట వాటిని నివాస స్థలాలుగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు నిర్ణీత రుసుము చెల్లిస్తూ సంబంధిత ఆర్డీఓకు నాలా కన్వర్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. నాలా కన్వర్షన్‌ అనంతరం లే అవుట్‌ అనుమతులు సంబంధిత తాసిల్దార్ కార్యాలయంలో లేదా గ్రామ పంచాయతీ నుంచి తీసుకోవాలి. అయితే ఇవేమీ లేకుండానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వ్యవసాయ భూములు, ఇండస్ట్రియల్‌ స్థలాల్లో అక్రమంగా వెంచర్లు ఏర్పాటు చేస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు.

ఆదాయానికి భారీగా గండి: లేఅవుట్‌ అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న వెంచర్ల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతుండగా, పెద్ద మొత్తంలో డబ్బు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల జేబుల్లోకి వెళ్తుంది. ఆర్డీఓ నుంచి నాలా కన్వర్షన్‌ అనుమతులు రాగానే లే అవుట్‌ అనుమతుల కోసం కలెక్టరేట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకుగాను నిర్ణీత స్థలంలో నుంచి 10 శాతం భూమిని పార్కుల నిర్మాణం కోసం మున్సిపాలిటీకి అప్పగించాల్సి ఉంటుంది. అలాగే ఏర్పాటు చేసే వెంచర్‌లో అన్ని అంతర్గత రోడ్ల వెడల్పు కనీసం 40 ఫీట్లు ఉండాలి.నిబంధనల మేరకు రోడ్లు ఏర్పాటు చేసేందుకు దాదాపు 30 నుంచి 40 శాతం స్థలం అవసరం అవుతుంది. లేఅవుట్‌ అనుమతులు తీసుకుంటే నిర్ణీత స్థలంలో నుంచి దాదాపు సగం భూమి వెచ్చించాల్సి రావడంతో రియల్‌ వ్యాపారులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో పార్కు స్థలం రూపేణా మున్సిపాలిటీ పెద్ద మొత్తంలో స్థలాన్ని కోల్పోవడంతోపాటు లే అవుట్‌ అనుమతుల కోసం దరఖాస్తు ఫీజుల రూపంలో ఆదాయానికి భారీ గండి పడుతోంది.

నాన్‌ లే అవుట్‌తో సమస్యలు: లే అవుట్‌ అనుమతులు లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసే ప్రజలకు అనేక సమస్యలు ఎదురుకానున్నాయి. ఇంటి నిర్మాణాలకు మున్సిపాలిటీ నుంచి అనుమతులు లభించవు. ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌)కు దరఖాస్తు చేసుకుంటే స్థలం మార్కెట్‌ విలువలో 14 శాతం షార్ట్‌ ఫాల్‌ రుసుం చెల్లించాలి. ఇదీగాక బెటర్‌మెంట్‌ చార్జీల పేరుతో మరింతగా ప్రభుత్వానికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ప్లాటు కొన్న వ్యక్తికి అదనపు భారం పడుతోంది. ఒకవేళ నిర్మాణ అనుమతులు తీసుకోకుండానే ఇంటి నిర్మాణం చేపడితే బ్యాంకులు రుణం మంజూరు చేసే అవకాశాలు ఉండవు.

అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేయరాదు: వికారాబాద్ జిల్లా కలెక్టర్ : నుమతులు లేని లే అవుట్‌ వెంచర్లలో ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేయవద్దు. అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో నానా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని, ఇంటి నిర్మాణాలను జిల్లా కలెక్టర్ నుంచి అనుమతులు ఇవ్వడం జరగదు. అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి,ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular