• అనుమతులకు మించి అంతస్తులు…!
• ముడుపులు ఇస్తేనే సక్రమం…. ఈయకపోతే అక్రమం..!
• ప్రభుత్వం ఇచ్చే జీతం కన్నా…. సొంత ఆదాయంపైనే మక్కువ..!
• సెటిల్మెంట్ అడ్డగా మారిన జిహెచ్ఎంసి కూకట్ పల్లి 24 సర్కిల్
కూకట్ పల్లి నవంబర్ 14, ప్రభ: కూకట్ పల్లి 24 సర్కిల్ మున్సిపల్ పరిధిలోని ఆల్విన్ కాలనీ, చక్రధర కాలనీ, ఆల్విన్ కాలనీ ఫస్ట్ ఫేస్, లో 2వ ఫేస్ లో అక్రమ భవన నిర్మాణాలకు అడ్డు అదుపులేకుండా పొయింది. ఆల్విన్ కాలనీ లో భవన నిర్మాణదారులు అనుమతులకు విరుద్ధంగా అదనపు అంతస్తులు వేసి ఇలాంటి సెట్ బ్యాక్ వదలకుండా నిర్మిస్తున్నప్పటికీ 24 సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 24 సర్కిల్ కూకట్ పల్లి పలు ప్రాంతాలలో కూడా అనుమతులు లేని ఐదు అంతస్తులతో కూడిన భవనాలు, ఆపై కమర్షియల్ నిర్మిస్తున్న కూడ అధికారులు చోద్యం చూడటంలో మర్మమేమిటనేది తెలియడం లేదు. ఇలాంటి అక్రమ భవనాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే భవన యాజమానులకు సహకరిస్తున్నారని అక్రమ అంతస్తుకి లక్ష కి పైనే వసూలు చేస్తున్నారని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అని తెలుస్తుంది. జిహెచ్ఎంసి చైన్ మాన్ లతో భారీగా ముడుపులు ముట్ట చెప్పుకుంటున్నారని స్థానిక ప్రజలు చెవులు కోరుకుంటున్నారు. ప్రజలు ఆన్లైన్ ట్విట్టర్ ద్వారా అధికారులకు పిర్యాదు చేసిన స్పందించకపోవడంతో నోటీసులు జారీ చేస్తామంటూ ట్విట్టర్ ద్వారా ప్రలోభాలు పలుకుతూ చేతులు దులుపుకుంటున్నారు.
చైన్ మాన్, అవుట్ సోర్స్ లే బ్రోకర్లు అంటున్న స్థానికులు
మున్సిపల్ కార్యాలయంలో ఒక్కో ఎరియాకు ఒక్కో ఛైన్ మెన్, అవుట్ సోర్స్ లని నియమించి అక్రమంగా భవనాలు నిర్మిస్తున్నటు వంటి భవనాలు,కట్టడాల గురించి అధికారులకు చేరవేసేలా చూడాలి కాని భవన యాజమానులు మచ్చిక చేసుకుంటే చాలు ఆ అక్రమ భవనాల వైపు కనీసం మచ్చుకైన దరి చేరకుండా ఉండటం సదరు చైన్ మెన్ కు అలవాటుగా మారిందని అదే అదనుగా ఇష్టానుసారం అనుమతులు లేని భవనాలు నిర్మిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ కట్టడాల గురించి ఎన్ని సార్లు అధికారులకు పిర్యాదు చేసినప్పటికీ 24 సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతొ అక్రమ భవనాలు నిర్మిస్తున్న యజమానులు ముందుగానే అధికారులకు చేతులు తడిపినట్టుగా ప్రజలు భావిస్తున్నారు.
ట్విట్టర్ ఫిర్యాదులను అటక ఎక్కిస్తున్న వైనం
కూకట్ పల్లి 24 సర్కిల్ పరిధిలోని పలు కాలనీలలో అక్రమ భవనాల గురించి జిహెచ్ఎంసి సమస్యల పరిష్కారం కొసం ఏర్పాటు చేసిన ట్విట్టర్ లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఫిర్యాదు చేసిన వారు వాపోతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ట్విట్టర్ లో ఫిర్యాదులు స్వీకరించాల్సిన జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్,సిటీ ప్లానర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక పోగా నెలల తరబడి ఆ ఫిర్యాధులను సాగదీయడమో కాకా సమస్య పరిష్కారం అయినట్టుగా అట్టీ ఫిర్యాదుకు పరిష్కారం చూపినట్టుగా చెప్పి క్లోస్ చేయడం ఎన్నో మార్లు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా 24 సర్కిల్ మున్సిపల్ పరిధిలో ఎన్నో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు మాత్రం అనుమతులు లేని భవనాలకు అడ్డుకట్ట వేయకపోతే మాత్రం భవిష్యత్ లో తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












