శెట్టిబలిజ వనభోజన మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన గుబ్బల లక్ష్మీనారాయణ
బీసీ జాబితా నుంచి తొలగించిన శెట్టి బలిజ కులాన్ని వెంటనే చేర్చాలని డిమాండ్
రంగారెడ్డి నగర్ నుంచి బస్సులలో భారీగా తరలిన శెట్టి బలిజ లు
కుత్బుల్లాపూర్ నవంబర్ 16,ప్రభ:రంగారెడ్డి నగర్ శెట్టిబలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి కార్తిక మాసంలో నిర్వహించే వనభోజనం మహోత్సవము ఏదో ఒక దేవాలయం దగ్గర కుటుంబాలన్నీ కలుపుకొని కుటుంబాల సమేతంగా వనభోజన కార్యక్రమం నిర్వహించబడుతుంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం ములుగు జిల్లా వర్గల్ సరస్వతి దేవాలయం ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. ఈ ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున శెట్టి బలిజ యువతి యువకులు జాతి పెద్దలు భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి. శెట్టిబలిజ కులాన్ని బీసీ జాబితా నుంచి తెలంగాణ ప్రభుత్వం తొలగించింది. ఈ ప్రభుత్వం అయినా శెట్టిబలిజ కులాన్ని బీసీ జాబితా లో చేర్చే వరకు మా పోరాటం కొనసాగుతుందని ఈ ప్రభుత్వం కూడా గెలిచిన వెంటనే చేరుస్తామని హామీ విస్మరించిందని ఇకనైనా చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి నగర్ శెట్టిబలిజ సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

