హైదరాబాద్, నవంబర్ 16, ప్రభ:బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జాతీయ పత్రికా దినోత్సవం ను రాష్ట్రీయ పత్రికాకార్మికుల మహాసంఘం (ఆర్.పి.యం.) ఆధ్వర్యంలో నిర్వహించారు. మహాసంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పవిత్ర మోహన్ సమంత్ రాయ్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఈ వేడుకను జరుపుకున్నారు.ఈ సందర్భంగా జర్నలిజాన్ని దేశంలోని నాలుగో స్తంభంగా అధికారికంగా గుర్తించాలని కోరారు. ప్రజలకు నిజాలను అందించేందుకు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. విధుల్లో బెదిరింపులు, దాడులు, ఇబ్బందులు ఎదురైనప్పుడు జర్నలిస్టులకు రాష్ట్రీయ పత్రికాకార్మికుల మహాసంఘం (ఆర్.పి.యం.) అండగా ఉంటుందని తెలిపారు.జర్నలిస్టుల కోసం ఆరోగ్య సేవలు, వైద్య సదుపాయాలు, గృహ వసతి వంటి ముఖ్య సంక్షేమ పథకాల కోసం మహాసంఘం రాష్ట్ర–కేంద్ర ప్రభుత్వాల వద్ద నిరంతరం పోరాడుతున్నట్లు చెప్పారు. జర్నలిస్టులందరూ ఐక్యతగా ఉండి, సమష్టిగా పోరాడాలి అని పిలుపునిచ్చారు.అదనంగా, నేషనల్ మీడియా కాన్ఫరెన్స్ మరియు ఐ ఎఫ్ ఎం ఎస్ (ఇండియన్ ఫెడరేషన్ ఫర్ మీడియం & స్మాల్ న్యూస్‌పేపర్స్ ఆర్గనైజేషన్) ప్రతి రాష్ట్రంలో చురుకుగా పనిచేస్తున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని రాష్ట్రీయ పత్రికాకార్మికుల మహాసంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ బి. శ్రీకాంత్ లాల్ సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ, నరేష్, రాజేశ్ బడోని, ఆరొహి రావత్, అన్వర్, నరేష్ కుమార్, జగదీష్, శ్రీనివాస్, పురుషోత్తమ్, రాకేష్, అంజాద్, వీర శేకర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలు….
RELATED ARTICLES

