ఇందిరా నగర్ సంక్షేమ సంఘం నూతన కమిటీ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే కృష్ణారావు…
కూకట్ పల్లి: సంక్షేమ సంఘాల నిర్వాహకులు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ఇందిరా నగర్ సంక్షేమ ఎన్నికల్లో విజయం సాధించిన కమిటీ సభ్యులను కృష్ణారావు ఆయన క్యాంపు కార్యాలయంలో అభినందించారు. నూతన సంక్షేమ సంఘం అధ్యక్షులు సిహెచ్.గిరిసాగర్, ప్రధాన కార్యదర్శిగా కే.పరుశరాం , కోశాదికారి ఎమ్.చక్రవర్తి లతోపాటు కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. నూతన నూతనంగా ఎన్నికైన కమిటీ వారు బస్తీ సంక్షేమం అభివృద్ధి కోసం పాటుపడాలని తాను కమిటీకి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో అందిస్తానని కృష్ణారావు హామీ ఇచ్చారు. అనంతరం ఇందిరా నగర్ సంక్షేమ సంఘం సభ్యులు కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ను, బాలనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు.



