ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ ఎన్ రెడ్డి

తీర్మాణించిన మేడ్చల్ జిల్లా కమిటీ
మేడ్చల్: ప్రైవేటు పాఠశాలల నిర్వహకులపై బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్న వారి నుంచి పాఠశాలల నిర్వవాహకులకు రక్షణ కల్పించాలని తెలంగాణ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ఎన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలోని విఐపి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మేడ్చల్ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవలి కాలంలో వరంగల్ జిల్లాలో పిడిఎస్ యూ నాయకులు పాఠశాల యాజమాన్యంపై బౌతిక దాడులకు దిగడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా తరుచుగా జరుగుతూనే ఉన్నాయని ఆందేళన వ్యక్తం చేశారు. కులసంఘాలు, విద్యార్థి సంఘాలు, జేఏసీలు, రాజకీయ పార్టీల అనుబంద సంఘాలు అంటూ ఇలా నిత్యం ప్రతి పాఠశాల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూనే ఉన్నారని అన్నారు. ఇలాంటి వాటిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంతోమంది పేద విద్యార్థులకు బడ్జెట్ పాఠశాలలు విద్యాబుద్దులు నేర్పిస్తున్నాయని గుర్తు చేశారు. సేవే పరమావధిగా నిర్వహిస్తున్న పాఠశాలలను రక్షణ కరువైందని వాపోయారు. ట్రస్మా రాష్ట్ర కోశాధికారి శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిబందనల మేరకు పాఠశాలల నిర్వహణ కోసం సంఘం తగిన సలహాలు సూచనలను అందిస్తుందని తెలిపారు. ఇఎస్ ఐ, పిఎఫ్, ప్రొఫెషనల్ టాక్స్ తదితర అంశాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా అంశాలపై రాష్ట్ర కమిటి ఇప్పటికే ఉన్నతాధికారులతో చర్చించామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రామేశ్వర్‌రెడ్డి, అధికార పత్రినిధి రాంచందర్, సత్యారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, కోశాధికారి గిరిబాబు లతో పాటు జిల్లాలోని వివిధ మండలాల అధ్యక్ష,కార్యదర్శులు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. *ట్రస్మా మేడ్చల్ జిల్లా నూతన కమిటి* తెలంగాణ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా కె.శ్రీనివాస్ రెడ్డి, గడ్డమీది బాలరాజు, కె.ఆంజనేయులు, కె.శ్రీనివాస్‌లు, ఎస్.సోమశేఖర్, ధనలక్ష్మి, ఎస్.అశోక్‌రెడ్డి, మథ్యూ జోసఫ్, తాజోద్దీన్, స్వరూప్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బిర్రు ఆంజనేయులు, కార్యనిర్వహక కార్యదర్శులుగా సిహెచ్ నర్సింహులు, ఎస్.ఉపేందర్, సహాయ కార్యదర్శులుగా వీరన్న, జి.మన్‌మోహన్‌రావు, ఎం.సాయిగణేష్, జి.విజయ్ భాస్కర్‌రెడ్డి, టి.లిథియా, సి.శ్రీనివాస్ రెడ్డి, కెవిఎన్ రెడ్డి, ఈ.దశరథ్ గౌడ్, కో ఆప్షన్ సభ్యులుగా సిహెచ్ మహేందర్‌రెడ్డి, ఎస్.చంద్రశేఖర్, ఆనంద్, మల్లిఖార్జున్ రెడ్డి, జితేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, రాజిరెడ్డి, శ్రీనాథ్‌రావు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

