Thursday, January 15, 2026

కూకట్ పల్లి 24 సర్కిల్ టి.పి.ఎస్ మధు ఓవరాక్షన్…

• కూకట్ పల్లి సర్కిల్ పరిధిలో కోకొల్లలుగా అక్రమ నిర్మాణాలు…

• వివరణ కోరిన మీడియాతో టిపివో సినిమా డైలాగ్స్..

• వివరణకు ఫోన్లు చేయొద్దు… మీ ఫోన్లు లిఫ్ట్ చేయడమే నేను పనిగా పెట్టుకున్నానా..? నాకు వేరే పనులు ఏం లేవా?.. అంటూ డైలాగ్స్…

• అక్రమ నిర్మాణాలపై టిపివో నిస్సహాయ వైఖరి…

• మొక్కుబడిగా సర్కిల్ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న టిపివో…

కూకట్ పల్లి: కూకట్ పల్లి మున్సిపాలిటీకి ఇటీవల వచ్చిన కూకట్ పల్లి ఇంచార్జ్ టౌన్ ప్లానింగ్ అధికారి (టిపివో) మధు పనుల్లో కంటే మాటల్లో ఓవరాక్షన్ కనిపిస్తుంది. కూకట్ పల్లి సర్కిల్ పరిధిలోని ఆల్విన్ కాలనీ 1వ ఫేజ్ లో కొందరు అక్రమార్కులు ఫ్యూచర్ స్కీం భూములను కబ్జా చేసి నిర్మాణం చేపట్టారు. ఈ అక్రమ నిర్మాణాలపై ఇటీవల వార్తాపత్రికల్లో కథనాలు ప్రచురింపబడ్డాయి. ఇదే విషయంపై టిపివో అధికారి మధు కు ఫోన్లో వివరణ కోసం ఫోన్ చేసిన యెడల ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కార్యాలయానికి వెళ్లి ఎప్పుడు చర్యలు తీసుకుంటారని వివరణ కోరగా బదులుగా ఆయన విలేకరులతో మీరు ఫోన్లు చేయొద్దు మీ ఫోన్లు లిఫ్ట్ చేయడమే నేను పనిగా పెట్టుకున్నానా..? నాకు వేరే పనులు ఏం లేవా?.. అంటూ సినిమా డైలాగులు మాట్లాడారు. సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై రోజువారీగా వార్తా కథనాలు వస్తూనే ఉన్నాయి. అయినా సర్కిల్ లో టిపివో గా బాధ్యతలు చేపట్టిన ఈయన ఇప్పటివరకు అక్రమ నిర్మాణానికి సంబంధించి ఏ చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం. మూడు నెలలుగా ఎలాంటి అనుమతులు లేకుండా యదేచ్చగా ఫ్యూచర్ స్కీం భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన విషయం అధికారులకు తెలిసి కూడా ఇప్పటివరకు నోటీసుల పేరిట కాలయాపన చేస్తూ అదే విషయాన్ని మూడు నెలలుగా చెప్పటం హాస్యాన్నీ తలపిస్తుంది.

సర్కిల్లో కోకొల్లలుగా అక్రమ నిర్మాణాలు… చర్యలు శూన్యం.. ఓన్లీ కలెక్షన్స్..?

కూకట్ పల్లి 24 సర్కిల్ లో అధికారులు నిర్లక్ష్యం పర్యవేక్షణ లోపం వల్ల నిబంధనలకు విరుద్ధంగా కోకొల్లలుగా అక్రమ నిర్మాణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సర్కిల్ పరిధిలోని కూకట్ పల్లి, ఆల్విన్ కాలనీ, వివేకానంద నగర్, హైదర్ నగర్ డివిజన్ లలో అక్రమ నిర్మాణాలు బహిరంగంగా జరుగుతున్నా వార్తా పత్రికల్లో కథనాలు వచ్చినప్పటికీ ఆయన ఏ ఒక్క దానిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం పై నిబంధనలో ఉన్న లొసుగులను ఆసరాగా తీసుకొని నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేస్తున్న వారి నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులకు మించి నిర్మిస్తే వారు అడిగినంత ఇయాల్సిందే లేదంటే నోటీసులు ఇచ్చి, లేదా నిర్మాణ సామాగ్రి తీసుకెళ్లి భయభ్రాంతులకు గురిచేసి ముక్కుపిండి వసూలు చేస్తున్నారని నిర్మాణదారులు బెంబలెత్తిపోతున్నారు. కూకట్ పల్లి టౌన్ ప్లానింగ్ లో జరుగుతున్న అవినీతిపై జోనల్ కమిషనర్ దృష్టి సారించి వారి ఆటలు కట్టించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి నిర్మిస్తున్న నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular