కూకట్ పల్లి నవంబర్ 18,ప్రభ:వివేకానందనగర్ కాలనీలోని శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తుల కోసం నిత్య అన్నదాన కార్యక్రమం గత రెండు రోజులుగా విజయవంతంగా కొనసాగుతుంది. వడ్డపల్లి నర్సింగరావు గత 36 సంవత్సరాల క్రితం అయ్యప్ప స్వామి భక్తుల కోసం నిర్మించిన అయ్యప్ప దేవాలయంలో ప్రతి సంవత్సరం నుంచి నేటి వరకు భక్తుల కోసం మధ్యాహ్నం నిత్యాన్నదానంతోపాటు సాయంత్రం అల్పాహార కార్యక్రమం 45 రోజులపాటు నిర్వహిస్తున్న విషయం భక్తులందరికీ విధితమే. ఈ ఏడాది అయ్యప్ప మాల ధరించిన భక్తుల కోసం ఈ నెల 16న ఆలయ కమిటీ చైర్మన్ వడ్డేపల్లి రాజేశ్వరరావు, అఖిల భారత అయ్యప్ప సేవా సమితి వ్యవస్థాపకులు అరుణ్ గురుస్వామి కరకములచే నిత్యానదాన కార్యక్రమం ప్రారంభం కాగా రెండవ రోజు మంగళవారం కూకట్ పల్లికి చెందిన శ్రీకల్ప గ్రూప్స్ అధినేత శుద్ధపల్లి సుధాకర్ అయ్యప్ప భక్తులకు మధ్యాహ్నం బిక్ష (భోజనం), సాయంత్రం అల్పాహారం అయ్యప్ప భక్తుల కోసం ఏర్పాటు చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరై బిక్ష స్వీకరించారు.
శ్రీకల్ప గ్రూప్స్ అధినేత శుద్ధపల్లి సుధాకర్ ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులకు అన్న సమారాధన
RELATED ARTICLES

