కుత్బుల్లాపూర్, నవంబర్ 19, ప్రభ: కుత్బుల్లాపూర్ జీడిమెట్ల లొ “వాసుదేవ్ కోఆపరేటివ్ థ్రిఫ్టు ఎండ్ క్రెడిడ్ సొసైటీ” ఆద్వర్యములో 72 వ అఖిల భారత సహకార వారోత్సవాలు బుధవారం వైభవంగా తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్, మేడ్చెల్-మల్కాజిగిరి జిల్లా సహకార అధికారులు కలసి సంయుక్తముగా నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కేవీఎన్అన్నపూర్ణ, మేనేజింగ్ డైరెక్టర్- తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ ఆర్. సురేఖ రాణి, జాయింట్ రిజిస్ట్రార్, ఫ్యాకటీ- తెలంగాణ సహకార యూనియన్ వెంకటరెడ్డి, డి సి ఓ మేడ్చెల్-మల్కాజిగిరి జిల్లా ఆర్ఎంవి ఆనంద్ రావు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కావూరి రామారావ్, చైర్మన్-వాసుదేవ్ కోఆపరేటివ్ సొసైటీ, వై నాగేశ్వరరావు,
మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవ్ సొసైటీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కావూరి రామా రావు మాట్లాడుతూ… 72వ సహకార వారోత్సవాలకు విచ్చేసిన ప్రముఖులకు, కో-ఆపరేటివ్ బ్యాంకు స్టాల్ కు, డిస్టిక్ కో-ఆపరేటివ్ బ్యాంకు సిబ్బందికి, వివిధ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటి సిబ్బందికి, థ్రిఫ్టు సొసైటి సిబ్బందికి స్వాగతం పలుకుతూ… ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశము ఇచ్చినటువంటి తెలంగాణా రాష్ట్ర సహకార మూనియన్ వారికి, మేడ్చల్ జిల్లా సహకార ఆఫీస్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. తమ వాసు దేవ్ కో-ఆపరేటివ్ సొసైటి మేడల్ జిల్లాలో జిడిమెట్ల, ఉప్పల్, రాంపల్లి లో మూడు బ్రాంచీలతో ప్రజలకు ఆర్థిక సేవలను అందిస్తుందని చెప్పారు. చిన్న వ్యాపారులు, రుణాల కోసం అలాగే పొదుపు లేక జమ చేసుకునే వారికి ఆకర్షనీయమైన వడ్డీని అందిస్తున్నాయని, కావున తమ బ్రాంచీలను సందర్శించి సేవలను వినియోగించు కోవాలని తెలిపారు. అనంతరం మేడ్చల్ డి సి ఓ టి.వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… సహకార సంఘం యొక్క విశిష్టతలను వివరిస్తూ…అన్ని రకాల సొసైటీ చైర్మన్లను, ప్రసిడెంట్స్ల లని సహకార సంఘంల బలోపేతానికి నిబద్దతతో పని చేసి తమ జిల్లా ని సహకార సంఘాలలో ఉన్నతమైన స్థానంలో ఉంచాలని కోరుకుంటున్నానని అన్నారు. అలాగే సహకార చట్టాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి అందరి చైర్మన్ లతో చర్చాగోష్టి నిర్వహించి వారి అవసరాలను తెలుసుకొని, పలు సొసైటీ చైర్మన్లు డి సి ఓ వెంకటరెడ్డి ని సత్కరించినారు. ఆర్.సురేఖ రాణి మాట్లాడుతూ… నవంబర్ 14 నుండి 20 వరకు సహకార వారోత్సవాలు లో బాగస్వాములైన వారందరికి అభినందలను తెలియజేశారు. అలాగే సహకార సంస్థల ద్వారా ఆత్తునిర్బార్ భారత్ ని సాధించాలని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ జాతీయ సహకార విధానాన్ని రూపొందిచిందని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం కూడా తమ అన్ని సొసైటీల స్టాఫ్ ని సహకార యూనియన్ ట్రైనింగ్ కు తప్పక హాజరై సొసైటీ విధానాలను తెలుసుకోవాలని, అందరూ పారదర్శకంగా పనిచేయాలని కోరారు. కె.వి.యస్ అన్నపూర్ణ మాట్లాడుతూ… సహకార సంఘాల స్థాపన తదనంతర 72 సంవతరాల మార్పులను క్షుణ్ణంగా వివరించారు. అందరు కలసి సహకార గీతాన్ని ఆలపించి సహకార గీతం గురించి తెలియజేశారు, సహకార సంఘాల సభ్యుల చే సహకార ప్రతిజ్ఞ చేయించారు. అలాగే ప్రాథమిక సహకార సూత్రాలు, సహకార విధానం, సంఘాన్ని ఎలా నిర్శించాలి, ఎలా నడిపించుకోవాలి, సహకార సంఘ సభ్యుల హక్కలు – బాధ్యతలు, పాలకవర్గం తీసుకోవాలసిన జాగ్రత్తలు, అభివృద్ధి ప్రణాళికలు ఏర్పాటు చేసుకోని తెలంగాణ రాష్ట్ర సహకార సంస్థను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఆనంతరము “వాసుదేవ్ కో ఆపరేటివ్ సొసైటి చైర్మన్ ముఖ్య అతిథులను శాలువలతో సత్కరించినారు.
ఈ కార్యక్రమములో వాసుదేవ్ కో ఆపరేటివ్ బ్రాంచీల మెనెజర్స్, ఏరియా మెనెజర్స్, మేడ్చల్ జిల్లా సహకార సిబ్బంది, స్థానికులు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.







