• ఆల్విన్ కాలనీ 2 ఫేస్ లో నాలా బఫర్ ఆక్రమణపై ఫిర్యాదులు…!
• అయినా స్పందించని టిపిఓ విభాగం..!
• ముడుపులు గట్టిగానే అందాయని గుసగుసలు..!
• జిహెచ్ఎంసి అధికారుల వ్యవహార శైలిపై పలు అనుమానాలు..!
• హైడ్రా వెంటనే స్పందించాలంటన స్థానిక ప్రజలు..!
కూకట్ పల్లి నవంబర్23, ప్రభ: కూకట్ పల్లి 24 సర్కిల్ పరిధిలోని కే ఆల్విన్ కాలనీ 2 ఫేస్ లో జరుగుతున్న నాలని బఫర్ జోన్ ని ఆక్రమించి భవన నిర్మాణంపై పలు సోషల్ మీడియా ఛానల్లో వీడియోలు వచ్చాయి. నాలా బఫర్ జోన్ ని ఆక్రమించి చేస్తున్న నిర్మాణాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. వీడియోలు అధికారులకు సైతం పంపించడం, ఆవెను వెంటనే అధికారులు స్పందించి నాలాను ఆక్రమించి జరుగుతున్న నిర్మాణాన్ని వెంటనే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఒకవైపు చర్యలు తీసుకుంటామని ప్రకటించిన వెంటనే, నాలపై జరుగుతున్న నిర్మాణ పనులు వేగం పెంచాయి. పనులు వెటనే జరిగిపోవడమే కాకుండా, దర్జాగా నాలకు ప్రహాలి గూడ కూడా నిర్మించడం విశేషం. అధికారులు మాత్రం దాన్ని చర్యలు చేపట్టకపోవడంలో పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు అధికారులే తొందరగా పనులు పూర్తి చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. పనులు మాత్రం రాత్రివేళల్లో కూడా కొనసాగిస్తున్నారు. పనులు నడుస్తుండటం, అధికారులు దానివైపు పట్టించుకోకపోవడాన్ని బట్టి చూస్తే…. దానివెనుక వున్నది అధికారులేనని స్థానికులు భావిస్తున్న పరిస్థితి. చర్యలు తీసుకుంటామన్న అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదు..? పైగా పనులు పూర్తి కావస్తున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడక పోవడంలో ఆంతర్యమేంటి..? యాక్షన్ తీసుకుంటామన్న అధికారులకు కలెక్షన్లు ముట్టాయా…. ఇలా స్థానికులు లేవనెత్తుతున్న ప్రశ్నలు. ఒక వైపు మీడియా వెలుగులోకి తీసుకురావడం…మరో వైపు స్థానికులు దానిపై జిహెచ్ఎంసి టౌన్ ప్లాన్ అధికారులకు చేరవేయడం… అయినా అధికారుల్లో చలనం రావడం లేదంటే.. దాని వెనుక వున్న మతలబు ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అక్రమ భవన నిర్మాణాలనే పట్టిచుకోని అధికారులు ప్రభుత్వ స్థలాలను, నాలాలను కబ్జా చేసి నిర్మాణాలు కొనసాగిస్తున్నా పట్టించుకోవడం లేదంటే…. అధికారులకు ఏవిధంగా… ఏస్థాయిలో ముడుపులు అందుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. అధికారులు ముడుపులకు ఆశ పడుతుండటంతో.. నిర్మాణ దారులు బరితెగించిపోతున్నారనేది నగ్న సత్యం. ఆల్విన్ కాలనీ 2వ ఫేస్ నాలాను బఫర్ జోన్ ని ఆక్రమించి చేస్తున్న నిర్మాణం పై అధికారుల తాత్సారం వెనుక వున్న మతలబు ఆమ్యామ్యాలేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఆల్విన్ కాలనీ 2వ ఫేస్ లో నాలాపై బఫర్లో జరుగుతున్న నిర్మాణం యాక్షన్ తీసుకుంటారా.. లేకా కలెక్షన్ల కోసం దానిపై ప్రేమ ఒలకబోస్తారా..? తేల్చాల్సింది అధికారులే…. అవసరమైతే స్థానికులు బల్దియా బాస్ వద్దకు వెల్తామని…స్పందిచని పక్షంలో హైడ్రా దృష్టికి సైతం తీసుకువెల్తామని, ఆల్విన్ కాలనీ 2వ ఫేస్ లో గల నాలాపై నిర్మిస్తున్న భవనాన్ని ఆపే వరకు ఫిర్యాదులు చేస్తూనే వుంటామని చెబుతున్నారు. ఏధిఏమైనా అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా..?లేదా..? వేచి చూడవలసి ఉంది.




