ఆర్మూర్ నవంబర్ 28,ప్రభ: ఏసీబీ ట్రాప్ | మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఏ రాజు (మునిసిపల్ కమీషనర్ ఏ రాజు) లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.అవీనితి అధికారులు మారడం లేదు. నిత్యం ఏసీబీ దాడులు (ఏసీబీ రైడ్స్) చేపడుతున్నా భయపడటం లేదు. తమ వద్దకు వచ్చే ప్రజలను లంచాల పేరిట పట్టి పీడిస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా (నిజామాబాదు డిస్ట్రిక్ట్) ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్, అతని డ్రైవర్ (ప్రైవేట్ వ్యక్తి)ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పట్టణ పరిధిలో నిర్మించిన ఇంటికి నంబర్ కేటాయించడానికి మున్సిపల్ కమిషనర్ రాజు రూ.20 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గురువారం మున్సిపల్ కమిషనర్ (మునిసిపల్ కమీషనర్) తన డ్రైవర్ ద్వారా లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం డ్రైవర్ బ్యాగ్‌ను చెక్ చేయగా.. లెక్కల్లో చూపని రూ.4.30 లక్షల నగదు గుర్తించారు. ఆ డబ్బును స్వాధీనం చేసుకొని కమిషనర్‌తో పాటు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.

