కూకట్ పల్లి

బి ఎన్ ఎన్సీసీ, 10/2 కంపెనీ, వివేకానంద డిగ్రీ కాలేజీకి చెందిన హర్ష వర్ధన్ నవంబర్ 2 నుండి డిసెంబర్ 5 వరకు నిర్వహించిన బీఎంసీ (బేసిక్ మౌనంటైనీరింగ్ కోర్స్) ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ శిక్షణ శిబిరం సిక్కింలోని ఇండియన్ హిమాలయన్ సెంటర్ ఫర్ అడవెంచర్ మరియు ఈ సి ఓ టూరిజం (ఐ హెచ్ సి ఏ ఈ ) లో జరిగింది.ఈ కోర్స్‌లో భాగంగా హర్ష వర్ధన్ పర్వతారోహణలో అవసరమైన అనేక సాంకేతికతలను నేర్చుకున్నారు. ముఖ్యంగాట్రెక్కింగ్, జుమరింగ్, రాపెల్లింగ్, డిసెండింగ్, స్నో వాక్, ఐస్ ఆక్స్ వినియోగం, ఐస్ వాల్ వాక్, రోప్ ఫిక్సింగ్ వంటి పద్ధతులపై ప్రత్యేక శిక్షణ పొందారు. అదేవిధంగా అత్యంత కీలకమైన సెల్ఫ్ – అరెస్ట్ టెక్నిక్యూస్ నేర్చుకొని ప్రాక్టికల్‌గా అభ్యాసం చేశారు.శిక్షణ సమయంలో 5200 మీటర్ల ఎత్తును విజయవంతంగా అధిరోహించడం ఆయన కోర్సులో విశిష్ట ఘట్టంగా నిలిచింది.భవిష్యత్తులో మరిన్ని శిఖరాలను అధిరోహించాలని, పర్వతారోహణ రంగంలో ముందుకు సాగాలని హర్ష వర్ధన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

