Wednesday, January 14, 2026

జోరుగా అక్రమ భవనాలు…

24 సర్కిల్‌లో చైన్‌ మెన్‌ ల చేతివాటం…?

పాత భవనంపై కొత్త అనుమతితో భవన నిర్మాణం..?

లోపకారి ఒప్పందాల పట్ల ప్రజల్లో తీవ్ర విమర్శలు..

అక్రమ నిర్మాణాలకు అధికారుల అండబేరం కుదుర్చుకుని సలహాలు…

పట్టించుకునే తీరిక ఉండదు..టూర్లకు మాత్రం తయార్‌..

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌..

అనుమతి లేని ప్రతీ అదనపు అంతస్తుకు రూ. లక్ష, సిబ్బంది, అధికారులతో కలిసి ప్రతీ నెలా ఓ యాత్ర. ఇదీ జీహెచ్‌ఎంసీ అధికారుల తీరు. అక్రమ నిర్మాణాలు జీహెచ్‌ఎంసీలోని కొందరు అధికారులు, సిబ్బందికి ఆదాయ వనరుగా మారాయి.

కూకట్ పల్లి డిసెంబర్ 18,ప్రభ:కూకట్ పల్లి 24సర్కిల్‌ ఆల్విన్ కాలనీ డివిజన్‌ పరిధిలో ఇటీవల అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.. షంశిగూడ ఇందిరా హిల్స్ కాలనీలో పాత భవనంపై అనుమతులకు విరుద్ధంగా అంతస్తులు ఇవ్వడం, ఇందిరా హిల్స్ కాలనీలో ఇప్పటికే అనుమతులు లేని అదనపు అంతస్తుల నిర్మాణం కొనసాగుతున్న ప్పటికి అటువైపుగా అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికిష్టం వచ్చినట్టుగా భవనాలు నిర్మించడంపై అధికారుల విధుపట్ల అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది.వివరాల్లోకి వెళితే.. 24 సర్కిల్‌ లో చైన్‌మెన్‌గా ఉద్యోగం చేపట్టిన తర్వాత వ్యక్తి వ్యవహారం మరింత సందేహాస్పదంగా మారిందని స్థానికులు ఆరోపిస్తు న్నారు. నియమాల ప్రకారం నోటీసులు జారీ చేసినట్లు బయటకు చూపుతుండగా, భవన యజమానులకు లోపల ‘విూ పని విూరు చేసుకోండి’ అంటూ అనుమతులు లేకుండా నిర్మాణాలు కొనసాగేందుకు అవకాశమిస్తు న్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార వ్యవస్థలో ఈ రకమైన లోపకార వ్యవహారం అక్రమ నిర్మాణాలకు మరింత వేగం అందిస్తోందని ప్రజలు అంటున్నారు. అంతా ఆయనే..దీర్ఘకాలికంగా ఇక్కడే సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. కూకట్ పల్లి ఆల్విన్ కాలనీ డివిజన్ల పరిధి షంశిగూడ ఇందిరా హిల్స్ కాలనీలో అనుమతి లేని ప్రతి అదనపు అంతస్తుకు రూ. లక్ష చొప్పున సదరు అధికారికి సమర్పించుకుంటే అంతా ఆయనే చూసుకుంటారని స్థానిక కాంట్రాక్టర్లు భవన నిర్మాణదారుడికి సలహాలు ఇస్తుండడం గమనార్హం. బిల్డర్లు, కాంట్రాక్టర్లతో మాట్లాడేందుకు ఒక ఫోన్‌ను, అధికారులు, సిబ్బందితో మాట్లాడేందుకు మరో ఫోన్‌ను ఆయన వినియోగిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే సదరు ఉద్యోగి కోట్ల రూపాయలకు పడగలెత్తారని, స్థానికంగా భారీగా ఆస్తులు కూడబెట్టారని ప్రచారం జరుగుతోంది.

నెలకో యాత్ర..

సర్కిల్‌ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు సాగుతున్నప్పటికీ వాటిని పట్టించుకునే సమయం లేని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఇటీవల జవాన్లు, చైన్‌మన్లు,సెక్షన్‌ అధికారులతో కలిసి యాత్రకు వెళ్లినట్లు సమాచారం. భారీగా ముడుపులు అందాక అందరూ కలిసి ప్రతి నెలా ఓ యాత్రకు వెళ్తున్నట్లు కార్యాలయంలో చర్చ జరుగుతోంది.

సార్‌కు తెలియదు.. నాతో మాట్లాడండి..

సర్కిల్‌ – 24 పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా కడుతున్న కట్టడాలపై టౌన్‌ ప్లానింగ్‌ ఏసీపీ ని వివరణ కోరేందుకు పలు మార్లు ఫోన్‌ చేయగా, ఏదైనా ఉంటే సెక్షన్‌ ఆఫీసర్‌తో మాట్లాడాలని ఫోన్‌ ఆయనకు ఇవ్వడం కొసమెరుపు. సెక్షన్‌ ఆఫీసర్‌ మాట్లాడుతూ ‘మా సార్‌కు ఏదీ తెలియదు. ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి’ అంటూ పొంతన లేని సమాధానాలతో దాటవేసే ప్రయత్నం చేయడం గమనార్హం.అదే విధంగా మిత్ర హిల్స్ లో జరుగుతున్న అదనపు అంతస్తుల నిర్మాణం కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా, 24 సర్కిల్‌ జిహెచ్ఎంసి అధికారులు మాత్రం ‘చోద్యం చూస్తున్నట్లే’ ఉన్నారని ప్రజలు మండిపడుతున్నారు. ప్రాంతీయ ప్రజలు తాము నిబంధనలు పాటిస్తూ నిర్మాణాలు చేపడితే అనుమతుల కోసం నెలల తరబడి తిరగాల్సి వస్తుందని, కానీ కొందరికి మాత్రం అధికారులు స్వయంగా సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇకపై కూడా అధికారులు మౌనం పాటిస్తే 24 సర్కిల్‌లో నిర్మాణ నియంత్రణ పూర్తిగా ధ్వంసమవుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అందుకే తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular